Friday, September 7, 2012

'SUDIGAADU' CROSSES 200K USD mark in USA




The gross collections of Sudigaadu has crossed 200000 USD so far which translates into Rs. 1.11 crores. The highest sales figure for any of Allari Naresh’s film in USA so far was under 10 lacs. The initial offer that came to the producer from USA was Rs 8 lacs, but producer saw huge potential and didn’t sell it. The trailers and poster designs ensured curiosity among exhibitors and movie lovers. This has generated big interest in distributors and a new distributor has given a risky proposition and bought it for 25 lacs and share in profits of the producer there after. It has collected a gross of 100000 USD in the first three days of release. And Sudigaadu has crossed a gross of 200000 USD in two weeks. Sudigaadu has opened up market for small and medium budget entertainers. It’s a known fact that NRIs love entertainment and doesn’t mind watching films in theaters as long as they are entertaining.

Thursday, September 6, 2012

సడన్ స్టార్' (నరేష్) ను అభినందించిన 'సూపర్ స్టార్' (రజనీ కాంత్)



సడన్ స్టార్' (నరేష్) ను అభినందించిన 'సూపర్ స్టార్' (రజనీ కాంత్)
 అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' సాధించిన ఘన విజయం 'తమిళ నాడు' కు పాకింది. తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' సుడిగాడు ని చూసేలా చేసింది.
'సుడిగాడు' ను చూసేందుకు చెన్నై లో ఏర్పాట్లు చేయాలని చిత్ర దర్శక నిర్మాతలను ఆయన కోరటం జరిగింది. ఈ నేపధ్యంలో 'సుడిగాడు' చిత్రాన్ని బుధవారం చెన్నై లోని తన నివాసం లో చిత్రాని రజనీ చూసారు. ఆద్యంతం వినోదాన్ని చిత్రం పంచిందన్న అభిప్రాయాన్ని ఆయన వెలి బుచ్చారు. చిత్ర కధానాయకుడు నరేష్ , దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు , నిర్మాత చంద్రశేఖర్ . డి. రెడ్డి లు సూపర్ స్టార్ రజనీ తమ చిత్రాన్ని చూడటం ఏంటో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.

Monday, September 3, 2012

నగర ధియేటర్ లలో 'సుడిగాడు' నరేష్ హల్ చల్

నగర ధియేటర్ లలో 'సుడిగాడు'  నరేష్  హల్ చల్ 
కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న 'సుడిగాడు' ధియేటర్ లను హీరో నరేష్ , దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, నటీ నటులు హేమ, జ్యోతి, శ్రీలత,ఫిష్ వెంకట్, టార్జాన్, భవాని, అరవింద్, సారికా రామచంద్ర రావు, నర్సింగ్ యాదవ్. చిత్ర నిర్మాత చంద్రశేఖర్.డి. రెడ్డి, ఎగ్జి క్యూటివ్ నిర్మాత వివేక్ కూచి భొట్ల తది తరులు సందర్శించారు.
 ఆదివారం [2 -9 -12 ] సాయత్రం పంజాగుట్ట లోని పి.వి.ఆర్.ధియేటర్  ఆ తరువాత భ్రమరాంబ , చంద్రకళ, విమల్, సంధ్య, రాజధాని, మహాలక్ష్మి లలో ప్రేక్షకులను కలసి హీరో 'నరేష్' కృతజ్ఞతా పూర్వకంగా సంభాషించారు. ' తన కెరీర్ లోనే విజయ వంతమైన చిత్రంగా 'సుడిగాడు'ను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞ త లన్నారు. ఆనందంగా సినిమా చూస్తుండగా వచ్చి మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తున్నాను. మీ ఆనందం లో పాలు పంచు కోవాలనే ఇలా మీ ముందుకు వచ్చానని అన్నారు. సంధ్య ధియేటర్ లో తన 'అల్లరి' సినిమా చూశానని  అది పెద్ద విజయం సాధించిందని అలాగే ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించటం  ఎంతో ఆనందం గా వుందని నరేష్ తెలిపారు. 
దర్శకుడు 'భీమనేని శ్రీనివాసరావు' మాట్లాడుతూ..' తన గత చిత్రాలు శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం, చిత్రాల స్థాయిలో ఈ సుడిగాడు' విజయం సాధించి నందుకు, అందుకు కారకులైన ప్రేక్ష కులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ యాత్రలో పాల్గొన్న ఇతర నటీ నటులు 'సుడిగాడు' విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.





















Saturday, September 1, 2012

వినోదమే సుడిగాడు విజయ మంత్రం


వినోదమే సుడిగాడు విజయ మంత్రం
Allఅరుంధతి మూవీస్‌ పతాకంపెై చంద్రశేఖర్‌ డి. రెడ్డి నిర్మించిన ‘సుడిగాడు’లో అల్లరి నరేష్‌ హీరో. తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘తమిళ్‌ పడమ్‌’ ఆధారంగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు రూపొందించిన ఈ సినిమా ఇటీవల విడుదలెై ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.అల్లరి నరేష్‌ ఇప్పటివరకూ నటించిన చిత్రాలలోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘సుడిగాడు’ ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా రిపీట్‌ ఆడియన్స్‌ వస్తున్నారు ఈ చిత్రానికి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ఇలా స్పందించారు. ‘ఈ సినిమా మీద మొదటినుంచీ అంచనాలయితే ఉన్నాయి కానీ ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని మాత్రం నేను ఊహించలేదు. ‘సుడిగాడు’ను చిన్న సినిమాల్లోనే ‘గబ్బర్‌సింగ్‌’, ’దూకుడు’ అంటున్నారు. ఇది నాన్నగారు బతికున్నప్పుడు ఒప్పుకున్న చివరి సినిమా. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ‘సుడిగాడు’ పెద్ద హిట్టయింది.

తొలివారంలో రూ. 8 కోట్ల షేర్‌ వసూలు చేసిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. సినిమాలోని వినోదం వల్లే ఆ స్థాయి హిట్టయ్యిందనేది నా అభిప్రాయం. పబ్లిసిటీకి, మౌత్‌ టాక్‌ విస్తరించడం కూడా దీనికి కారణం. ఒరిజినల్‌ ‘తమిళ్‌ పడమ్‌’ కంటే పెద్ద హిట్టయింది. ఆ సినిమా డెైరెక్టర్‌ అముదన్‌కు అది తొలి చిత్రం. ‘సుడిగాడు’ రిలీజయ్యాక ఆ సినిమా హిందీ, కన్నడ రీమేక్‌ హక్కులు కూడా అడుగుతున్నారు. ఖర్చుకు తగ్గ విజయం ఇది. అది వరకు నా సినిమాల మార్కెట్‌ రూ. 6 నుంచి రూ. 6.5 కోట్లుగా ఉండేది. ఈ సినిమాకి బడ్జెట్‌ ఎక్కువవుతుందని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు చెబితే నిర్మాత చం ద్రశేఖర్‌ డి. రెడ్డిగారు బడ్జెట్‌ గురిం చి ఆలోచించవద్దని భరోసా ఇచ్చారు. ఖ ర్చు పెట్టిన దానికి తగ్గట్లే బిజినెస్‌ జర గడం, కలెక్షన్లు రావడం, ఈ సినిమాని కొనుక్కున్న వాళ్లంతా సం తోషంగా ఉండటం చాలా హ్యాపీ. ఈ సినిమా కోసం భీమనేనిగారు చాలా కష్టపడ్డారు.
Allari
స్పూఫింగ్‌ (పేరడీ) కోసం వంద సినిమా ల్ని ఎంపిక చేసుకోవడం, వాటిలోంచి ఈ సినిమాకి పనికివచ్చే అంశాల్ని ఎంచుకోవడం సామాన్య విషయం కాదు. వంద సినిమాల్లోని ఐటమ్స్‌ తీసుకుని చేసిన సినిమా కాబట్టి దీనికి ‘ఐటమ్‌ రాజా’ అని పేరుపెడితే బాగుంటుందని చెప్పా. కానీ తనకు ‘ఎస్‌’ సెంటిమెంట్‌ ఉందని భీమనేని చెప్పారు. అలా ‘సుడిగాడు’ సెట్టయింది. ఎవరినీ అనుకరించలేదు ఇది స్ఫూఫింగ్‌ సినిమా అయినా ఏ హీరో బాడీ లాంగ్వేజ్‌నీ నేను అనుకరించలేదు. నా బాడీ లాంగ్వేజ్‌తోనే ఆ ఐటమ్స్‌ చేయమని భీమనేని సూచిస్తే, అలాగే చేశా. అది బాగా వర్కవుట్‌ అయ్యింది. ఈ సినిమాని చాలామంది హీరోలు చూశారు. వాళ్లంతా ఎంజాయ్‌ చేశారు. అందరు హీరోల అభిమానులూ ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ‘మడత కాజా’ తర్వాత శ్రీవసంత్‌ ఈ సినిమాకి పనిచేశాడు. ఐదు పాటలకి ఐదు భిన్నమెన బాణీలిచ్చాడు. భాను, ప్రేమ్క్ష్రిత్‌, నిక్సన్‌ నా చేత బాగా డాన్సులు చేయించారు. ఒకప్పుడు డాన్సు చెయ్యడమంటే కష్టంగా అనిపించేది. ఇప్పుడు వాటిని బాగా ఆస్వాదిస్తున్నా.

'సుడిగాడు' నూతన ప్రచార చిత్రాలు