వినోదమే సుడిగాడు విజయ మంత్రం
అరుంధతి మూవీస్ పతాకంపెై చంద్రశేఖర్ డి. రెడ్డి నిర్మించిన ‘సుడిగాడు’లో అల్లరి నరేష్ హీరో. తమిళ హిట్ ఫిల్మ్ ‘తమిళ్ పడమ్’ ఆధారంగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు రూపొందించిన ఈ సినిమా ఇటీవల విడుదలెై ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.అల్లరి నరేష్ ఇప్పటివరకూ నటించిన చిత్రాలలోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘సుడిగాడు’ ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు ఈ చిత్రానికి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ ఇలా స్పందించారు. ‘ఈ సినిమా మీద మొదటినుంచీ అంచనాలయితే ఉన్నాయి కానీ ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని మాత్రం నేను ఊహించలేదు. ‘సుడిగాడు’ను చిన్న సినిమాల్లోనే ‘గబ్బర్‌సింగ్’, ’దూకుడు’ అంటున్నారు. ఇది నాన్నగారు బతికున్నప్పుడు ఒప్పుకున్న చివరి సినిమా. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ‘సుడిగాడు’ పెద్ద హిట్టయింది.
తొలివారంలో రూ. 8 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. సినిమాలోని వినోదం వల్లే ఆ స్థాయి హిట్టయ్యిందనేది నా అభిప్రాయం. పబ్లిసిటీకి, మౌత్ టాక్ విస్తరించడం కూడా దీనికి కారణం. ఒరిజినల్ ‘తమిళ్ పడమ్’ కంటే పెద్ద హిట్టయింది. ఆ సినిమా డెైరెక్టర్ అముదన్‌కు అది తొలి చిత్రం. ‘సుడిగాడు’ రిలీజయ్యాక ఆ సినిమా హిందీ, కన్నడ రీమేక్ హక్కులు కూడా అడుగుతున్నారు. ఖర్చుకు తగ్గ విజయం ఇది. అది వరకు నా సినిమాల మార్కెట్ రూ. 6 నుంచి రూ. 6.5 కోట్లుగా ఉండేది. ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువవుతుందని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు చెబితే నిర్మాత చం ద్రశేఖర్ డి. రెడ్డిగారు బడ్జెట్ గురిం చి ఆలోచించవద్దని భరోసా ఇచ్చారు. ఖ ర్చు పెట్టిన దానికి తగ్గట్లే బిజినెస్ జర గడం, కలెక్షన్లు రావడం, ఈ సినిమాని కొనుక్కున్న వాళ్లంతా సం తోషంగా ఉండటం చాలా హ్యాపీ. ఈ సినిమా కోసం భీమనేనిగారు చాలా కష్టపడ్డారు.

No comments:
Post a Comment