Thursday, October 18, 2012

వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమా గురించి " ఏవీ ఎస్'

                                                పత్రికా ప్రకటన 


                               వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం  సినిమా గురించి 


              బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా రూపొందిన " వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం  " చిత్రాన్ని వెంటనే నిషేధించాలి. బ్రాహ్మణ స్త్రీలను
  కించపరుస్తూ వారిని హీనంగా చూపిస్తూ ఈ సినిమా నిర్మించటం దుర్మార్గం...దుస్సాహసం...ఇది నూటికి నూరు పాళ్ళూ బ్రాహ్మణుల
  సహనాన్ని పరిక్షించటమే. ఒక్క బ్రాహ్మణ కులాన్ని మాత్రమే కాదు... ఏ కులాన్ని కించపరిచే అధికారం ఎవరికీ లేదు. ఈ చిత్రాన్ని
  ఎక్కడ సెన్సార్ చేసారో, ఈ టైటిల్ ను ఎక్కడి చాంబర్ మంజూరు చేసిందో వెంటనే తెలపాలి. నాగరిక సమాజంలో ఇటువంటి ధోరణులు
  తీవ్ర అభ్యంతరకరం ....రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సినిమా విడుదల కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి.  ఈ సినిమాకు సంబంధించి పత్రికలలో, ఎలెక్ట్రానిక్ మీడియాలో ఎటువంటి ప్రకటనలు రాకుండా చూడాలి.చిత్ర   నిర్మాత, దర్శకుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. భవిష్యత్తులో   మరెవ్వరూ ఈ తరహా సినిమాలు నిర్మించకుండా అవసరమైన చట్టాన్ని
  రూపొందించాలి. ఇందుకు ఆంద్ర ప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి , దర్శకుల సంఘం కూడా సహకరించాలని విజ్ఞప్తి ....


  ఏవీయస్
  తెలుగు చలనచిత్ర నటుడు, రచయిత, దర్శకుడు ...
  18 - 10 - 2012

1 comment:

  1. This is really interesting…
    Rosesandgifts.com

    ReplyDelete